అప్రమత్తమైన జిల్లాయంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. అతనితో సన్నిహితంగా మెదిలిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే కొంతమంది హోం క్వారంటైన్‌లో ఉండకూడా...తమకు తాము కరోనా లేదని సర్టిఫికెట్ ఇచ్చుకుని మరీ బయటకు వస్తుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మరో మూడు కేసులకు సంబంధించిన కొంతమందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినప్పటికీ పాటించడం లేదని, ఇలాంటి వారి మూలంగానే లోకల్ కాంటాక్టు కేసులు ఉధృతమయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మర్యాదగా వినకుంటే నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇక కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు. ఇంత చేస్తున్నా కరోనా పరీక్షలంటే ప్రజలు ముందుకు రావడానికి జంకుతున్నారు. నిరక్షరాస్యులు, సమాజ పోకడలు తెలియని వారంటే సరిపెట్టుకోవచ్చు. కరోనా లక్షణాలుంటే అలక్ష్యం చేయకుండా పరీక్షలకు ముందుకు వచ్చి చికిత్స చేయించుకుంటే ప్రాణహాని ఉండకపోగా, అక్కడితోనే ఆ వైరస్ నిలువరించిన వారవుతారని వైద్య వర్గాలు మరోసారి పిలుపునిస్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లాయంత్రాంగాన్ని సంప్రదించాలని వెళ్లిన ప్రతి చోటా అధికారులు పదేపదే చెబుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>