ఇప్పటి వరకు కొరటాలశివచిరంజీవిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీలో చరణ్నటించే విషయంలో తన అనుమతులు ఇవ్వడానికి ఆలోచనలు చేసిన రాజమౌళిఇప్పుడు ఈ విషయమై ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వెంటనే ‘ఆర్ ఆర్ ఆర్’ పూణే షెడ్యూల్ ప్రారంభిస్తామని ఆ షెడ్యూల్ లో అలియా భట్చరణ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఇంకా చరణ్‌కు సంబంధించి చాల కీలక సన్నివేశాలు షూట్ చేయవలసినవి ఉన్నాయని అందువల్ల ఈ ఏడాది చివరి వరకు చరణ్‌ను ఆచార్య షూటింగ్ వైపు పంపే ప్రసక్తిలేదు అంటూ చాల సున్నితంగా రాజమౌళితన అభిప్రాయాలను చరణ్ద్వారా చిరంజీవిదృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.
దీనితో చరణ్‘ఆచార్య’ లో నటించే ప్రసక్తి ఈ ఏడాది లోపు ఉండదు అన్న విషయాలు మెగా కాంపౌండ్ కు పూర్తిగా అర్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవిఒక మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీలో మహేష్నటించడం లేదు అని స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన పరిస్థితులలో ‘ఆచార్య’ లో చరణ్‌కోసం సృష్టించిన పాత్రను ఇప్పుడు ఎవరిచేత నటింప చేయాలి అన్న అంతర్మధనం కొరటాలచిరంజీవిలలో పెరిగిపోతున్నట్లు టాక్.
ఇలాంటి పరిస్థితులలో షూటింగ్ లు తిరిగి మొదలైనా ‘ఆచార్య’ షూటింగ్ ను ఎలా కొనసాగించాలి అన్న విషయమై సమాధానం లేని ప్రశ్నలు. ప్రస్తుతం కొరటాలను వెంటాడుతున్నట్లు టాక్. దీనితో చరణ్చేయవలసిన పాత్రను మెగా కాంపౌండ్ కు సంబంధించిన యంగ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్వరుణ్లతో భర్తీ చేయాలనే ఆలోచన కొరటాలకు వచ్చినా ఈ ఆలోచనను చిరంజీవిముందు బయటపెట్టడానికి కొరటాలహడిలిపోతున్నట్లు టాక్..
]]>