దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని సంస్థలు బంద్. స్కూళ్ళు కూడా బంద్. ఈ తరుణంలోనే లాక్ డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగింపు ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ కేంద్రం ప్రకటించక పోయినా సీఎం కేసీఆర్మాత్రం లాక్ డౌన్ పొడిగించే అవకాశాలే కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ 10th పరీక్షలు రాసే వారు ఇబ్బందులు పడకుండా తెలంగాణా విద్యాశాఖ డిజిటల్ పాటాలు 10th విద్యార్ధులకి చెప్పనుంది.
దాంతో 10 th విద్యార్ధులు ఇంట్లో నుంచే పాటాలు నేర్చుకోవచ్చు. దూరదర్సిన్ యాదగిరి నుంచీ డిజిటల్ పాటాలు ప్రసారం అవనున్నాయి. ఏప్రియల్ 12 నుంచీ అనగా రేపటి నుంచీ ఈ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఉదయం 10 నుంచీ 11 గంటల వరకూ సాయంత్రం 4 నుంచీ 5 గంటల వరకూ క్లాసులు ఉంటాయి. ఇప్పటికే ఏపీలో 10th క్లాసు పిల్లలకి డిజిటల్ క్లాసులు దూరదర్సిన్ సప్తగిరిచానెల్ నుంచీ ప్రసారం అవుతున్నాయి.
ఏపీలో 10th విద్యార్ధులకి కూడా ఉదయం 10 నుంచీ 11 గంటల వరకూ సాయంత్రం 4 నుంచీ 5 గంటల వరకూ క్లాసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ డిజిటల్ విధానం ద్వారా 10th పిల్లలు పరీక్షలకి సిద్దమవ్వాలని తెలిపింది విద్యాశాఖ. ఇందులో విద్యార్ధులకి అర్థమయ్యే తీరిలోనే క్లాసులు సబ్జక్టుల వారీగా రూపొందించామని, తల్లి తండ్రులు తప్పకుండా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలని తెలిపింది.
]]>