ప్రపంచం మొత్తం కరోనా క్రైసిస్ లో ఇబ్బంది పడుతోంది. అందుకే తన వంతు సాయంగా తన యూట్యూబ్ఛానల్ ద్వారా వస్తున్న మొత్తాన్ని కరోనా బాధితులకు డొనేట్ చేస్తానంటోంది. మొన్నటి వరకూ తన యూట్యూబ్ఛానల్ లో యోగా , వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేసే రకుల్.. ఇప్పుడు కరోనా కోసం ఫండ్ రెయిజ్ చెయ్యడానికి వంటలు చేస్తూ.. వీడియోలు చేస్తోంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెబుతోంది ఇప్పటి వరకూ ఎవ్వరితో రిలేషన్ లో ఎందుకు లేరు. అసలు మీ స్టేటస్ సింగిలేనా అని కొంటెగా ఓ అభిమాని అడిగితే.. నేను ఇంకా సింగిలే. ఎందుకంటే.. ఎప్పుడూ నా వెనక డిటెక్టివ్ గా నా తమ్ముడు ఉంటాడు. నేనేం చేస్తున్నానో అన్నీ మా పేరెంట్స్ కి చెప్పేస్తాడు. అందుకే ప్రేమకు దూరంగా ఉన్నానని చెప్పింది.
కెరీర్ కి సంబందించి మరో ఇంట్రస్టింగ్ విషయం చెప్పింది రకుల్. సినిమా లో సెలక్ట్ అయ్యావని మెసేజ్ ఎప్పుడొస్తుందా..? ఫోన్లు ఎప్పుడొస్తాయా..? అని నాలాంటి వాళ్లు ఎదురుచూస్తూ ఉంటారని చెప్పింది. కానీ స్టార్ డైరెక్టర్ల పిల్లలకు, ప్రొడ్యూసర్ల పిల్లలకు, గాడ్ ఫాదర్లు ఉన్నవాళ్లకి ఇలా తిప్పలు పడే అవసరం లేదు ఎంచక్కా కావల్సిన సినిమాచేసే ఛాన్స్ దొరుకుతుందిగా అంటోంది రకుల్. ఇలా ఖాళీగా ఉంది కదా అని అన్ని విషయాలు షేర్ చేసుకుకంటోంది అమ్మడు.
]]>