మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్ అనంతరం కేసులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. తాజాగా మరో 21 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. ముబ్రా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాక్కున్న 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరందరూ మర్కజ్‌లో పాల్గొన్నవారిగా విచారణలో తేలింది. అయితే ఈ 21 మంది విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. వీరు ఎవరెవరిని కలిశారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. వీరికి అక్రమంగా ఆశ్రయం ఇచ్చిన స్థానికమసీదులు, పాఠశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
]]>
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ జమాత్ తర్వాత తమిళనాడు నుంచి ముంబైమీదుగా ముబ్రా ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ 21 మందిలో 13 మంది బంగ్లాదేశీయలు, 8 మంది మలేషియన్లుగా గుర్తించారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడం చట్టపరంగా నేరమని ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ తమకు సహకరించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం, అధికారులు పదేపదే చెబుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అయితే ముంబైకి సమీపంలోని ముబ్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
]]>