అయితే ఇక్కడ హీరోయిన్స్ఎం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు లేక ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వాళ్ళు సినిమాలను విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ దర్శక నిర్మాతలు ఇప్పుడు హీరోయిన్స్‌ని నామ మాత్రం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాళ్ళను ఎక్కువగా పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక డిమాండ్ అనేది ఏదీ లేదని ఇప్పుడు అవసరం మాత్రమే ఉంటుంది అని భావిస్తున్నారట.
వాళ్ళను కొంత కాలం పక్కన పెట్టి ఆర్ధిక కష్టాలు పూర్తిగా తొలగిన తర్వాత వాళ్లకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. చాలా మంది హీరోయిన్స్‌కి మన తెలుగులో డిమాండ్ ఎక్కువ. దీనితో వాళ్ళు భారీగా డిమాండ్ కూడా చేయడం మొదలు పెట్టారు. దీనితో భారీగా డిమాండ్ చేసిన వాళ్ళను ఇక పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు దీని గురించే టాలీవుడ్లో ఎక్కువగా జరుగుతున్నాయి చర్చలు. మరి ఎవరిని పక్కన పెడతారో చూడాలి.
]]>