అంతేకాకుండా 16 ఏళ్లు దాటితే తల్లిదండ్రులతో సంబంధం ఉండదు అక్కడ అంత స్వేచ్ఛ ఇస్తారు. నిజానికి అమెరికాలో చీమ చిటుక్కుమన్నా పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. కానీ 35 కోట్ల జనాభాఉన్న కానీ కరోనా పాజిటివ్ కేసులు ఆపలేకపోతున్నారు. అలాగే మరణాలను అదుపు చేయలేక పోతున్నారు. ప్రస్తుతం అమెరికాచాలా ఇబ్బందులు పడుతున్నారనే అనే చెప్పాలి.
కానీ మన భారతదేశం మాత్రం 135 కోట్ల మందిని అదుపులో ఉంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తూ వస్తుంది. పరిస్థితిని ముందే పసిగట్టి కరోనా వైరస్బారిన పడిన వాళ్ళని వెంటనే చికిత్స అందజేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. దీనితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ లో ఉంచి కరోనా వైరస్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలా చాలా జాగ్రత్తల గురించి వివరిస్తూ న్యూయార్క్నుంచి ఆమె తెలియజేస్తూ వచ్చింది. ఏది ఏమైనా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భరత్ప్రపంచ దేశాలకి ఒక మార్గదర్శిగా నిలబడడం ఒక గొప్ప విజయమే చెప్పాలి. ఇది నిజానికి ఒక్కరి వలన కాదు అనేక మంది కష్టపడుతున్నారు ఇందు కోసం.
]]>