ఈ విజయంలో చిత్రకారుల పాత్ర కూడా ఉంది. లె డక్ హిప్ అనే ఆర్టిస్టు రూపొందించిన పోస్టర్ ఎనలేని ప్రచారాన్ని కల్పించింది. ఆరోగ్య కార్యకర్తతో చేయి కలిపి నినదిస్తున్న వ్యక్తి చిత్రంతో గీసిన బొమ్మ సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. ప్రభుత్వ పిలుపు మేరకు అందరూ మాస్క్‌లు ధరించాలన్న పోస్టర్లు ఊరూ వాడా వైరల్ అయ్యాయి. అలాగే పామ్ త్రంగ్ హా అనే కళాకారుడు వైద్య సిబ్బంది కరోనా వైరస్ పరీక్షల్లో బిజీగా ఉన్న స్టాంప్. మరొక దానిలో పనిలో నిమగ్నమైన వైద్య సిబ్బంది వెనుక ఒక పిడికిలి కనిపిస్తుంది. ఇక ముందుగానే చైనా నుంచి వచ్చే విమానాలు నిషేధించడంతో పాటు పాఠశాలలు మూసివేసింది. లాక్‌డౌన్ అమలు చేసింది.
67 వేల మందిని క్వారంటైన్‌కు తరలించింది. 88 వేల మందికి పరీక్షలు నిర్వహించింది. 255 మందికి కరోనా నిర్ధారణ కాగా వారందరికీ ప్రత్యేకంగా చికిత్స అందించింది. వారిలో 128 మంది కోలుకున్నారు. అలాగే కఠిన శిక్షలు కూడా అమలు చేసింది. ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తారో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారో వారికి కఠిన శిక్షలు అమలు చేసింది. మాస్క్‌లు ధరించకుండా తిరిగితే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవన్న వార్నింగ్లతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేసింది.
]]>