ఈ తరలింపునకు కూడా ప్రత్యేక వాహనాలు లేదా ఆంబులెన్సులను కేటాయించాలి. కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యుల్లో కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించాలి. అంతకు మించి బంధువులెవరికీ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకూడదు.
ఒకవేళ కరోనా రోగి మృత దేహాలను భద్రపర్చాల్సి వస్తే, ఆయా ఆస్పత్రులే ఫ్రీజర్ బాక్సులను, రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మతపరమైన నమ్మకాల నేపథ్యంలో మృత దేహం ముక్కులు, చెవులు, నోటిలో విధిగా దూదిని ఉంచాలి. అనంతరం దేహాన్ని ప్లాస్టిక్ షీట్‌తో పూర్తిగా చుట్టేయాలి. దాని తర్వాత తెల్లని కాటన్ వస్త్రంతో చుట్టాలి.
అనంతరం పీపీఈ కిట్‌లోని జిప్ ఉండే మందపాటి బ్యాగులో దేహాన్ని ఉంచి శ్మశానానికి తరలించాలి. ఇక మార్చురీని శుభ్రం చేసేందుకు ఒకశాతం సోడియం హైపోక్టోరైట్ ఉన్న ద్రావణాన్ని గదిలోని అన్ని గోడలకు, నేలపైనా, కిటికీల్లో, వెంటిలేటర్లలో చల్లాలి. ఆ గదిలోపల ఉన్న సామగ్రిపై కూడా రోజుకు 5 సార్ల చొప్పున ఈ ద్రావణాన్ని చల్లాలి.
సాధారణ రోజుల్లోలా అంత్యక్రియలు జరిపేందుకు ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే... చనిపోయిన వ్యక్తి కరోనా పేషెంట్ కాబట్టి. ఈ క్రమంలో తెలంగాణప్రభుత్వ మృతదేహాలకు ఎలా అంత్యక్రియలు జరపాలనే అంశంపై గైడ్‌లైన్స్ రూపొందించింది. వీటిపై తెలంగాణలో బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్‌తో చనిపోయేవారిని ఖననం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు... హైందవ మత ఆచారాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ఆదేశాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణప్రభుత్వం మాత్రం మతపరంగా ఆదేశాలు జారీ చేసిందనీ, ఈ ఆదేశాలు ఓ మతానికి అనుకూలంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.
]]>