నాగాశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం తో మంచి సక్సెస్కొట్టాడు, ఆ తర్వాత ఫ్రెషర్ ..తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ పేరు సంపాదించాడు విజయ్. తర్వాత వచ్చిన ద్వారక, సినిమాఫ్లాప్ అయ్యింది.
కొత్త డైరెక్టర్సందీప్రెడ్డివంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డిసెన్సేషన్ అయ్యింది. తర్వాత వచ్చిన మహానటిసినిమాలో కూడా కనిపించాడు . పెద్దగా సక్సెస్‌లు లేని పరశురామ్‌తో గీతగోవిందం సినిమాచేసి 100 కోట్లతో పెద్ద హిట్ కొట్టాడు తర్వాత వచ్చిన నోటాతో తమిళ్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.
కొత్తగా డైరెక్షన్ చేసిన రాహుల్సాంస్క్యిత్యన్ తో టాక్సీవాలాచేసి పర్వాలేదనిపించుకున్నాడు . మరోఫ్రెషర్ భరత్కమ్మతో డియర్ కామ్రేడ్చేసి దెబ్బ తిన్నాడు . అంతేకాదు.. ఆ తర్వాత అంతగా సక్సెస్‌లు లేని క్రాంతిమాధవ్‌తో వరల్డ్ ఫేమస్ లవర్సినిమాచేసి మరో సారి ఫ్లాప్ అయ్యాడు.
ఈ మద్య అసలు హిట్లులేకపోవడంతో ఆల్రెడీ కమిట్ అయిన డైరెక్టర్లని కూడా పక్కనపెట్టి పూరీ జగన్నాధ్ తో ఫైటర్సినిమాచేస్తున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకూ కొత్త డైరెక్టర్లతో, కొత్త స్టోరీలతో చేసిన ప్రయోగాలు చాలు.. వాటి వల్ల తగలిన దెబ్బలు చాలు .. అందుకే నా నెక్ట్స్ సినిమాలు కూడా వెల్ నోన్ డైరెక్టర్లతో, సేఫ్ సబ్జెక్ట్ లే చేస్తానని డిసైడ్ అయ్యాడట విజయ్‌దేవరకొండ.
]]>