అయితే ఇది ఇలా ఉండగా కరోనా వైరస్కారణంగా అన్ని రంగాలు కూడా మూతపడ్డాయి. దీనితో ఆ కంపెనీస్ లో పనిచేసే కార్మికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికులను ఆదుకునేందుకు సినీ నటులు రాజకీయ నాయకులు వాళ్ళ వంతు సహాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. అంతే కాకుండా దీని కోసం పలువురు తారలు కేంద్రం సహాయనిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మెగాస్టార్చిరంజీవితల్లి అంజనా దేవి తన వంతు సహాయం చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే అంజనా దేవి తన మిత్రులతో కలిసి 700 మాస్క్ లు తయారు చేయడం జరిగింది. వాటిని బాధితులకు అందజేయడం జరిగింది. కరోనా వైరస్ యుద్ధంపై పోరాటానికి తన వంతు సహాయం చేస్తున్నారు. అంతే కాకుండా వయసు సైతం లెక్కచేయకుండా అంజనా దేవి కష్టపడిన తీరుకు నెటిజన్లు ఫిదాఅయ్యారు. ఎంతమంది ఎన్ని విధాలా సహాయం చేస్తున్న కొంతమంది మాత్రం వారికి ఇష్టమొచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. అలంటి వారు మారేంతవరకు ప్రభుత్వాలు ఎన్ని చేసిన దండగే.