తాజాగా.. ఇతర దేశాల్లో ఏర్పడుతున్న ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు భారత్‌కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు లెబనాన్‌కు గోధుమలను పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. జీటుజీ విధానంలో 90వేల టన్నుల గోధుమలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 50,000 టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్‌కు, 40,000 టన్నులను లెబనాన్‌కు ఎగుమతి చేయనున్నట్లు భారత్శుక్రవారం తెలిపింది. ఆయా దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంతటి కష్టకాలంలో ఇతర దేశాల ఆకలిని తీర్చేందుకు భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఈ సారి భారత్‌లో గోధుమ పంట ఉత్పత్తి కూడా అత్యధికంగా ఉంటుందని కేంద్రవ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు మిగులు గోధుమలను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది.
]]>