దీంతో దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా 7447కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంటల్లో 1035 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 40 మంది మృతి మృతి చెందారు. ఆస్పత్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోలుకున్నారు. అయితే.. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో కరోనా వైరస్‌ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇదే సమయంలో దేశంలోని 133 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఈ జిల్లాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 196 రెడ్‌జోన్ జిల్లాలనుకూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మోడీపొడిగిస్తారా.. లేక కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇస్తారా..? అన్నది అందరిలోఉత్కంఠ రేపుతోంది.
]]>