ఇంకొక అదృష్టమైన విషయం ఏమిటి అంటే కేవలం ఆసుపత్రులలో క్వారంటైన్ లో ఉన్న వారికి మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక అదృష్టమైన విషయం అనే చెప్పాలి. ఏది ఏమైనా కానీ జనాలు మాత్రం వారికి తగు జాగ్రత్తలు పాటించటం లేదు అనే చెప్పాలి. వారికి తోచిన సమయంలో రోడ్ల మీదకు వస్తున్నారు. అంతే కాకుండా చికెన్షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని ముందడుగు వేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే చికెన్షాపులన్నీ కూడా బందు చేయడం. కాకపోతే వారికి కాస్త సమయం కేటాయించటం అన్న నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే డీజీపీతో కలిసి తెలంగాణముఖ్యమంత్రికేసీఆర్ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చికెన్ షాపుల వద్ద జనాలు భారీగా ఉండటంపై తీవ్ర ఇబ్బందులు వస్తున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ వాళ్లకు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే ఏ చికెన్షాపు వద్ద అయినా కానీ పది మంది కంటే ఎక్కువగా ఉండకూడదు. అంతేకాకుండా ఆ పదిమంది కూడా సోషల్ డిస్టెన్స్ పాటించక పోతే మాత్రం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ఆదేశించారు. అంతేకాదు ఈ చర్యలు కఠినంగా తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీఎం కేసీఆర్పోలీస్అధికారులకు చేయడం జరిగింది.