సరే రాజకీయంగా అధికారపార్టీ తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించటం లాంటి విషయాలను పక్కనపెట్టేద్దాం. అసలు నిమ్మగడ్డ కు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? అన్నది ప్రధానమైన ప్రశ్నగా మారింది. మొత్తం వ్యవహారంలో నిమ్మగడ్డ చేసిన స్వీయ తప్పిదాలే ప్రధానంగా కనిపిస్తున్నది. మొదటిదేమిటంటే ప్రభుత్వంతో మాట్లాడకుండానే స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను ఏకపక్షంగా వాయిదా వేయటం. ప్రభుత్వంతో మాట్లాడకుండానే కేవలం ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు డిమాండ్లకు సానుకూలంగా స్పందించటం.
నిమ్మగడ్డ నిర్ణయంపై ప్రభుత్వం సుప్రింకోర్టుకెక్కింది. ఆ తర్వాత పరిణామాల్లో నిమ్మగడ్డ పేరుతో కేంద్రహోం శాఖకు ఓ లేఖవెళ్ళింది. అందులో శాంతిభద్రతలు క్షీణించాయని, తనతో పాటు తన కుటుంబానికి రక్షణ లేదని, అధికారపార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలతో పాటు అనేక అంశాలు ప్రస్తావించాడు. ఆ లేఖలోని అంశాలు ప్రభుత్వానికి చాలా డ్యామేజింగ్ గా ఉంది. లేఖవిషయం వెలుగు చూడగానే తాను ఆ లేఖను రాయలేదని ఓ న్యూస్ ఏజెన్సీకి చెప్పాడు. ఆ లేఖను తాను రాయనపుడు మరి లేఖవిషయంలో పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు ?
సరే ఈ విషయాలను పక్కన పెట్టేసినా లాక్ డౌన్ సందర్భంగా పేదలకు పంపిణి చేస్తున్న వెయ్యి రూపాయలు, నిత్యావసరాలను పార్టీల నేతలు పంపిణి చేస్తున్నారు. ఇందులో వైసిపితో పాటు టిడిపినేతలు కూడా ఉన్నారు. అయితే వైసిపినేతలపై చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, రామకృష్ణఎన్నకల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఫిర్యాదు చేయగానే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలంటూ కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించాడు. ఎన్నికల కోడ్ అమల్లో లేనపుడు ఏ పార్టీనేతలు పంపిణి చేస్తే నిమ్మగడ్డకు ఎందుకు ? చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేయగానే ముందుగా అందులోని వాస్తవాలు నిర్ధారించుకోకుండానే కలెక్టర్లకు ఎలా ఆదేశాలిస్తాడు ?
]]>