తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. కాగా లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. ఫలితంగా ఆయా ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్స్, కాంట్రాక్ట్ సిబ్బంది కొలువులు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న 28 మందిని తొలగిస్తూ, ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. బడ్జెట్ లేమితో వేతనాలు చెల్లించని పరిస్థితి ఏర్పడినట్లు ఉత్తర్వులు పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులు మే 1 నుంచి అమలు కానున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ గౌరవ వేతనం చెల్లించనున్నట్లు వారు పేర్కొన్నారు.
]]>