ఇలా కాదని సెకండ్ మూవీహలో..విక్రమ్ కుమార్డైరెక్షన్లో .. లవ్ స్టోరీట్రై చేశాడు. ఆ సినిమామిక్స్ డ్ టాక్ వచ్చినా హిట్ వరకూ రాలేకపోయింది. తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఇలా ఏ జానర్ లో తీసినా.. ఎలా తీసినా అఖిల్ఇప్పటి వరకూ ఒక్క హిట్ బోణీ కూడా కొట్టలేదు. కానీ అఖిల్తో పాటు సినిమాలు చేస్తున్నశర్వానంద్, నిఖిల్, నితిన్మాత్రం ఎలా గొలా సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు.
లాస్ట్ ఇయర్ మిస్టర్మజ్ను సినిమాతో ఆడియన్స్ముందుకు వచ్చిన ఈ హీరోతన 4 వ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్తో చేస్తున్నాడు. పూజా హెగ్డేహీరోయిన్గా స్టార్ట్ అయిన ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రొమాంటిక్ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అఖిల్ఆశలన్నీ.. ఇప్పుడు తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమామీదనే. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని అకౌంట్ లో వేసు కున్న అఖిల్ఈ సినిమాతో హిట్ గట్టెక్కాలని భావిస్తున్నాడు.
అయితే జెట్ స్పీడుతో సినిమాను పూర్తి చేస్తున్న అఖిల్జోరుకు కరోనా బ్రేక్ వేసింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన చిత్రయూనిట్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా ప్రభావం తగ్గినా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి. తెరుచుకున్నా ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్‌కు ఆశించిన హిట్ దక్కుతుందా..? వెయిట్ అండ్ సీ.
]]>