ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ తొలగింపు అంశం రాష్ఠ్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రమేశ్ కుమార్స్థానంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి ని నియమించిన జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ కోవిదుడైన వ్యక్తి ఎస్ ఈసీస్థానంలో ఉంటే చట్టాలను పటిష్టంగా అమలు చేస్తాడని, వ్యక్తులు శాశ్వతంకాదని, వ్యవస్థలు శాశ్వతమని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగు తోంది.
]]>
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్‌కుమార్‌ను మారుస్తూ ఏపీప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఈసీ పదవీ కాలాన్ని తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ యోగేశ్ అంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు చట్టబద్ధత లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టాలని ఏపీహైకోర్టు నిర్ణయించింది.
అయితే రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తొలగింపు అంత సులభం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఒక సారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధన నిర్దేశిస్తోందని చెబుతున్నారు.
]]>