తాజాగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశ ప్రధానిఅయిన నరేంద్ర మోడీఏర్పాటుచేసిన పీఎం కేర్స్ ఫండ్ కు ప్రముఖ లావాదేవీల కంపెనీ పేటీఎం 100 కోట్లు విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా 500 కోట్ల సేకరణ లభ్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసిందని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా సరే విరాళాలు అందించవచ్చు అని కంపెనీ అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఎవరైనా సరే పేటియం ద్వారా ఇచ్చే విరాళానికి తమ కంపెనీ నుంచి అదనంగా 10 రూపాయలు కలుపుదామని సంస్థ తెలియజేయడం జరిగింది.
ఈ విషయంపై సంస్థ సీనియర్ అధికారులు పది రోజుల్లో 100 రూపాయలు వంద కోట్లు సమకూరుతాయని ఆయన తెలియజేశారు. అలాగే పేటీఎం ఉద్యోగులు సైతం విరాళాలను ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. మరికొంత మంది విద్యుత్ఉద్యోగులు అయితే వారి మూడు నెలల వేతనాన్ని కూడా విరాళాల నిధికి సమర్పించారని తెలిపాడు. ఇక దేశ ప్రజలంతా ముందు అడుగు వేసి పీఎం కేర్స్ ఫండ్ లో భాగస్వామ్యం అవ్వాలని పేటీఎం సంస్థ తెలియజేయడం జరిగింది. దీనితో పాటు పేదవారికి అందరికీ కేవీఎన్ ఫౌండేషన్ తో అనుసంధానమైన అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంగా ఉందని తెలిపారు.