రేణు దేశాయ్... తీసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమా హీరోయిన్గా కంటే కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్యగా మంచి గుర్తింపు పొందారు. తొలి చిత్రం బద్రీతో తెలుగులో ఆరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే పవన్కల్యాణ్‌తో ప్రేమలో పడ్డారు. దీంతో ఆమె అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే రేణుపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి.
కొంతకాలం సహజీవనం చేశాక, పవన్‌ను రేణుదేశాయ్ వివాహం ఆడారు. అంతేకాదు, ఆ సమయంలోనే అకీరా కు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమె అస్సలు కనిపించలేదు. కానీ, పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన కొడుకు అకీరా ఇంటి నుంచి పారిపోవాలనుకుంటున్నాడని తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్ర స్తుతం స్వాతంత్ర్య జీవనం గడపుతున్న రేణు దేశాయ్.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గతంలో ప్రకటించారు.
దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక, ఇటవల రేణు.. పవన్కమ్‌బ్యాక్ మూవీ‘వకీల్ సాబ్'లో చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆ వార్తను ఖండించారు ఈ సీనియర్ హీరోయిన్.
]]>