- ఎన్నికల కమిషనర్ మార్పు తగదు
- రాజ్యాంగ వ్యవస్థలపై కర్రపెత్తనం సహించబోం
- ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలా..!
- ఎఫ్బీ లైవ్ లో ప్రభుత్వానికి దిశా నిర్దేశం
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా వణికిపోతున్న తరుణాన ఒక్క మన రాష్ట్రంలోనే అందుకు భిన్నమయిన వాతావరణం నెలకొనడం ఆశ్చర్యంగా ఉందని, రాజ్యాంగ సంబంధ వ్యవస్థలను తమకు అనుగుణంగా మలుచుకుని నిర్ణయాక శక్తులుగా తమని తాము అభివర్ణించుకుని వైఎస్సార్సీపీ ఏకపక్ష ధోరణిని అవలంబించడం తగదని యువఎంపీకింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈసీమార్పును వ్యతిరేకిస్తూ తాము కీలక అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అవసరం అనుకుంటే న్యాయపోరాటానికి సైతం సిద్ధమేనని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్నియామకం రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అత్యున్నత వ్యవస్థలను ప్రశ్నించేలా ఉం దని తమకు అనుకూలంగా లేరన్న ఒకే ఒక్కసాకుతో తమకు అనుగుణంగా ఆర్డినెన్స్ ను జారీ చేసుకుని విలువలకు తిలోదకా లు ఇవ్వడం భావ్యం కాదని అన్నారు. పంచాయతీ రాజ్చట్టంను అనువుగా చేసుకుని ఇలాంటి ఆర్డినెన్స్ లు జారీచేసి చీకటి పాల నకు తెరలేపిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని విమర్శించారు.
జీవో నంబర్ 617 ను చీకటి జీవోగా తాను అభివర్ణి స్తున్నానని అన్నారు. విపత్తు కాలాన ప్రజలను పట్టించుకోవడం మానుకుని తమ కుటిల రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ ప్రభుత్వానికే సాధ్యం అని పెదవి విరిచారు. కేవలం పంచాయతీ ఎన్నికలు వాయిదా వేశారన్న ఒకే ఒక్క కారణంగా ఆయనను అనర్హుడుగా తేల్చడం భావ్యం కాదని, కరోనా వైరస్ కారణంగా ప్రజారోగ్యం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఒక హితం కోరి చేసిన నిర్ణయం ముఖ్యమంత్రికి నచ్చకపోవడం ఆశ్చర్యం గా ఉందని, ఇది కేవలం కక్ష్య సాధింపు చర్య అని ఇప్పుడు తమ వారిని నియమించుకుని తమ మాట నెగ్గించుకునే చర్యలకు పూనిక వహించడం జగన్ సర్కారుకే చెల్లిందని దుయ్యబట్టారు.
ప్రశ్నిస్తే పుట్టగతులుండవా!
ఎవ్వరు ప్రశ్నించినా వారికి పుట్టగతులుండవు అన్న మాదిరి ప్రభుత్వం ఉందని, ఇటీవల నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డిని సస్పెండ్ చేసిన ఉదంతమే ఇందుకు తార్కాణమని అన్నారు. అదేవిధంగా నర్సీపట్నం ఎనస్తీషియన్ ను కూడా మాస్కుల గురించి ప్రశ్నించినందుకు మీడియాముఖంగా ప్రభుత్వం తీరును బట్టబయలు చేసినందుకు సస్పెండ్ చేయడం తగదని అన్నా రు. పాలక పక్షంలో అసహనం పెరిగిపోతుందని అనేందుకు రుజువుగా ఈ ఘటనలు నిలుస్తాయని, ఒంటెద్దు పోకడలతో నిర్ణయా ల అమలు తగదని చెప్పారు. అదేవిధంగా డాక్టర్లకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించాలని తమ పార్టీతరఫున కోరుతున్నామ ని, ఇప్పటికీ జూనియర్ డాక్టర్ల విన్నపం మేరకు తన వంతు యాభై వేల రూపాయలను విరాళంగా అందించానని, ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి వీరికి తగిన విధంగా మాస్కులు, పీపీఈ కిట్లు అందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..
ప్రజా శ్రేయస్సే ప్రథమావధి కావాలి
లాక్డౌన్ ను కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని మోడీతో సీఎం జగన్ చెప్పిన నిర్ణయం తగదు. పొరుగున ఉన్న ఒడిశాలో ప్రజారోగ్యంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాభై కేసులున్న రాష్ట్రం కరోనా కట్టడికి ఎన్నో ముందస్తు చర్యలు అమలు చేస్తోంది. కానీ ఇక్కడ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం ఒక్క జోన్ కే లాక్డౌన్ ను పరిమితం చేయాలని అడగ డం అపరిపక్వ ధోరణి. ఎంత భయంకర పరిస్థితులున్నా ఆయన మాట్లాడిన తీరు బాగుండడం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా దీనిని ఏ విధంగా మలుచుకోవాలన్నది చూస్తున్నా రు. బాధ్యత గల అధికారి గా స్థానికఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఎస్‌ఈసీ) తీరును తప్పుపట్టారు. నియంతృత్వ ధోరణి కారణంగా ఆ రోజు ఆ ప్రకటనకు కులం రంగు అంటించారు. ఇదే సమయంలో రహస్య జీవోలు తీసుకురావడం తగదు. ఆ రోగ్య అత్యయిక స్థి తి అమలులో ఉన్న సమయంలో రాజకీయాలు చేయడం తగదు.
నియంత పరిపాలన ఇది. కరోనాను కంట్రోల్ చేసేందుకు ఏమ యినా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేకా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా ? స్థానికఎన్నికల దృష్ట్యా ఆయ న గ్రామస్థాయిలో ఎలా బలపడాల నుకుంటున్నారన్నది చూసుకుంటున్నారా? అన్న వాటిపై స్పందించాలి. ప్రతి రోజూ ప్రజల తో ఒడిశాసీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతున్నారు. ధైర్యం నింపుతున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు భరోసా ఇవ్వ లేని స్థితిలో సీ ఎం ఉన్నారు. అసలు ప్రజారోగ్యంపై పట్టించుకునేందుకు తగు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాజకీయంగా పరిణామాలను మలుచుకుంటున్నారు. మరోవైపు వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఇవాళ కేసులు తగ్గకపోగా పెరుగుతున్నాయి. ఈ తరుణాన కొన్ని జోన్లకే లాక్డౌన్ పరిమితం చేయాలన్న నిర్ణయం ఏ మంత సబబు కాదు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మా పార్టీఅధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారు ఎక్కడెక్కడ చిక్కుకుపోయారో వారికి సహాయం అందించండని, సంబంధిత వర్గాల వారితో ఎప్పటికప్పు డు ఎంతో బాధ్యతతో మాట్లాడుతున్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖల రూపేణా తెలియజేస్తున్నారు. కానీ వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న తెలుగువారిని ఇక్కడికి రప్పించేందుకు కానీ లేదా ఉన్నచోటే ఉంచి వారికి ఆహారం, వసతి అం దించేలా చర్యలు తీసు కోవడంలో కానీ సహాయ సహకారాలు అందించేందుకు యాక్షన్ ప్లాన్ ఏమయినా తీసుకుంటున్నారా అ న్న విషయ మై స్పష్టత లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి ఏయే ఏర్పాట్లు చేస్తు న్నారు అన్నది వివరం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం..వైఫల్యం. ఈ తరుణాన సింగిల్ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిం చి పూర్తి వివరాలు ఉంచండి. కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు ఏయో చర్యలు తీసుకుంటున్నారు అన్న విఅందులో స్పష్టంగా పేర్కొనండి. ఇటువంటి సమయాల్లో కూడా డిజిటల్ గవర్నెన్స్ ను ఎందుకు వినియోగించు కోలేకపోతు న్నారు అన్నది మా సూటి ప్రశ్న.
అదేవిధంగా నిస్సహాయ, నిరుపేద కుటుంబాలకు ఈ ఆపద సమయంలో ఆదుకునేందుకు రూ. ఐదు వేలు ఇవ్వాలి. కానీ మీరు కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలను వలంటీర్లతోనూ, నిన్న మొన్నటి స్థానికసంస్థలకు సంబం ధించి బరిలో దిగిన నాయ కులతోనూ పంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం తగని పని. ఈ సందర్భంలో అధికార దుర్వి నియోగానికి ఒడిగడుతున్నారు. నిస్సహాయ స్థితిలో చేస్తున్న సాయంకు కూడా మీ పార్టీరంగులు అంటించడం తగదు. ప్రతి గ్రా మంలోనూ ఇదే తంతు నెరపడం విమర్శలకు తావిచ్చినా అధికార పార్టీపట్టించుకోవడం లేదు. నిరుపేదలకు రేషన్ ఇచ్చినా వె య్యి రూపాయలు ఇచ్చినా దీ న్నొక పార్టీకార్యక్రమంగా మలచడం సబబు కాదు. ఇది సంద ర్భం కాదు. ఇప్పటికైనా మేల్కొండి. కరోనా నియంత్రణకు ఏ చర్య లు చేపట్టాలో అన్న విషయమై సంబంధిత నిర్ణయాలు తీసుకోండి..వాటి వివరాలు ఎప్ప టికప్పుడు వెల్లడించాలన్నారు.
డాక్టర్లకు ఎంత మందికి మాస్క్ లు ఎంతమందికి పీపీఈలు కల్పించగలిగారు అన్నవి చెప్పండి? రాజకీయ నిర్ణయా లు తగవు.. ప్రజా శ్రేయస్సు అ న్నదే ప్రథమావధి కావాలి. డాక్టర్లను సస్పెండ్ చేయడం కూడా తగదు. రానున్న కాలంలో పరిణా మాలు విషమించక మునుపే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జూన్లోఈ కరోనా వైరస్ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. దీ నిపై దృష్టిసారించక, లాక్డౌన్ కొ న్ని జోన్లకు పరిమితం చేయాలనడం తగదు. ఇది రాజకీయాలకు అనువు గాని సమయం. పేద, నిస్సహాయ వర్గాలను ఆదుకోవా ల్సిన తరుణం... అంటూ తన ప్రసంగం ముగించారాయన.
]]>