అయితే.. ఇదేసమయంలో తెలంగాణముఖ్యమంత్రితోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఒకే విధమైన లాక్‌డౌన్‌ను అమలుచేయాలని సూచించారు. నిజానికి.. కేంద్రం నిర్ణయంతీ సంబంధం లేకుండా ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్,కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ అమలు చేసేందుకు మొగ్గుచూపే దిశగా ఉన్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రెడ్‌జోన్లలో కాకుండా మిగతా ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని జగన్ కోరారు. కాగా, ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీసూచించారు. ఇదే సమయంలో రెడ్‌జోన్లలో మరింత కఠినంగా నియమాలను అమలు చేయాలని ఆయన సూచించారు.
]]>