అయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వాతంత్య్ర కాంక్షను బలంగా కలిగిన ధీరుడిగానే ఆయన పాత్ర ఉంటుందనేది తాజా సమాచారం. ఆయన పాత్ర నిడివి తక్కువే ఉన్న అజయ్ దేవగణ్పాత్ర వల్లే ఎన్టీఆర్ - చరణ్పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్పాత్ర ఇన్స్పిరేషన్ గా ఉండనుందని సమాచారం. ఈ మూవీలో మన్యం వీరుడుగా అల్లూరిసీతారామరాజు.. తెలంగాణమన్యం వీరుడు కొమురం భీమ్గా ఎన్టీఆర్కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్పుట్టిన రోజు కానుకగా కొమురం భీమ్వీడియో రిలీజ్ చేస్తారని ఆ మద్య వార్తలు వచ్చాయి.
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకముందు ఇలాంటి కథలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గతంలో రాజమౌళితెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 మూవీకి సంబంది కూడా ఇలాంటి కథనాలు ఎన్నో వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే సినిమారిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే.
]]>