అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందామా... ఏప్రిల్, 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా జట్టు భారత్లో పర్యటన చేయడం జరిగింది. అప్పుడు టీమిండియా జట్టుకు మహమ్మద్ అజారుద్దీన్, దక్షిణాఫ్రికా జట్టు కు హన్సీ క్రోన్జే కెప్టెన్ గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా భారత్లో జరిగిన వన్డే సిరీస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ పై అభియోగాలు నమోదు అవ్వడంతో క్రికెట్ప్రపంచంలో చాలామంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంతేకాకుండా ఇండియన్బుక్కీ సంజయ్ చావ్లాతో చర్చలు నిర్వహించినందుకు ఢిల్లీపోలీసులు క్రోన్జే ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ విచారణ భాగంలో వన్డే సిరీస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ఈ విషయాన్ని నిజమే అని ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా మహమ్మద్ అజారుద్దీన్ తనని సంజయ్ చావ్లా అనే ఇండియన్బుక్కీ కి పరిచయం చేయడం జరిగింది అని పోలీసుల ముందు ఒక పెద్ద బాంబేపేల్చడం జరిగింది. అప్పట్లో టెస్టు సిరీస్ ఆడడానికి ఇండియాలో పర్యటించినప్పుడే సంజయ్ చావ్లా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామంటూ తన దగ్గర ప్రపోజల్ తీసుక వచ్చాడని తెచ్చాడని క్రోన్జే పేర్కొన్నాడు.