అప్పట్లో నరేష్ పక్కన నటించినా ఎందుకనో ఆ సినిమాఅనుకున్నంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. జబర్దస్త్ప్రారంభమైనప్పటి నుంచి అదే షోలో కంటిన్యూ అవుతూ పేరు సంపాదించిన కొద్ది మంది స్టార్స్ లో గెటప్ శ్రీను ఒకడు. బుల్లితెర కమల్ హాసన్గా పిలవబడే గెటప్ శ్రీనుకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.తన హావాభావాలతో స్కిట్ సక్సెస్ చేస్తాడు. ఇక గెటప్ శ్రీను తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో హైపర్ ఆదిఒకడు అని చెప్పవచ్చు. తమ హవాను కొనసాగిస్తున్న బుల్లితెర కమ్ బిగ్ స్ర్కీన్ ఆర్టిస్టులైన ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు ఫిల్మ్‌నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
అయితే ఆరా తీస్తే ఇది నిజమేననే ముచ్చట్లే వినబడుతుండటం విశేషం. గతంలో గెటప్ శ్రీనుకు మూడేళ్లలో రాని పేరు, హైపర్ ఆదికి మూడు నెలల్లో వచ్చింది అంటూ బుల్లెట్ భాస్కర్చేసిన కామెంట్స్ అప్పట్లో హీట్ పుట్టించాయి. అప్పుడే జబర్దస్త్ఆర్టిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మాస్అవినాష్ఓ టెలివిజన్రియాలిటీ షోలో యాంకర్ సుమగెటప్ శ్రీను, హైపర్ ఆదిలో ఎవరు టాలెంటెడ్ అని అడిగిన ప్రశ్నకు అవినాష్ హైపర్ ఆదియే ఎక్కువ టాలెంటెడ్ అని చెప్పడంతో మళ్లీ కోల్డ్‌వార్‌కు కారణమవుతోందని సమాచారం. ఇప్పటికే వీరి మధ్య ఉన్న దూరం కాస్త మరింత పెరుగుతుందని జబర్దస్ ఆర్టిస్లుల్లో కొంతమంది పేర్కొంటుండటం గమనార్హం.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>