Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298438

వైరల్ ఎహే : గుర్రంపై స్వారీ చేస్తున్న బాలీవుడ్ భాయిజాన్‌..... వీడియో వైరల్..!

$
0
0
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ప్రధానిమోదీలాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్ ఖాన్ఫాం హౌజ్‌లో కుటుంబంతో కలిసి సందడి చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 
 
నిన్న రాత్రి సల్మాన్ ఖాన్ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫామ్ లో రైడ్ చేస్తున్న వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భాయిజాన్ సోషల్ మీడియాలో మరో రోజు.. ఇలా రైడ్‌తో అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ మై లవ్‌ అనే క్యాప్షన్ తో సల్మాన్తన గుర్రానికి గడ్డి తినిపిస్తున్న వీడియో తెగ వైరల్ అయింది. 
 
నెటిజన్లు సల్మాన్గుర్రానికి గడ్డి తినిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం సల్మాన్రాధే సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమారెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. తనకు అచ్చొచ్చిన రంజాన్పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని సల్లూభాయ్ భావిస్తున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల షెడ్యూల్ లో కొన్ని మార్పులు జరగడంతో సినిమాఅనుకున్న తేదీకి విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. 



 


 

 



 

 


View this post on Instagram


 



 

 

 



 

 



 

 

 




 

 


A post shared by salman khan (@beingsalmankhan) on



]]>

Viewing all articles
Browse latest Browse all 298438

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>