దేశంలో ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కరోనా వ్యాప్తిని ఆపలేక పోతున్నాము. దేశంలో పాజిటివ్ మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇలాంటి సన్నివేశంలో లక్డౌన్ బహు కట్టుదిట్టంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశం లో ఒక్కరోజే 1035 పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది, ఇవాళ ఒక్క రోజే 40 మంది కరోనా మహమ్మారి కారణంగా చనిపోయారు.
దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కు చేరింది. మరో వైపు కరోనా బారిన పడి ఇప్పటి వరకు 642 మంది కోలుకున్నారు. ఇక మృతి చెందినవారి సంఖ్య 239 కి చేరింది. కానీ ఇప్పుడిప్పుడే కేంద్రం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివారు 7529 పాజిటివ్ కేసులు నమోదుకాగా 242 మంది చనిపోయారు , 652 కోలుకొని ఇళ్లకు వెళ్లారు.ప్రస్తుతానికి మనదగ్గర 6634 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు
]]>