జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈసంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.పశ్చిమ బెంగాల్లో లాక్‌డౌన్ సక్రమంగా అమలు కావడం లేదని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసిన మరునాడే మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మమత నిర్ణయంపై రాష్ట్ర ప్రజానీకంలో భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. పిచ్చి నిర్ణయమంటూ కొందరైతే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలను మరింత భయపెట్టే నిర్ణయమంటూ మరికొందరు పేర్కొంటుండటం గమనార్హం.
రాష్ట్రంలో కరోనా వైరస్వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై శనివారం ప్రధానిమోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలపై ప్రధానికి వివరించారు. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధానినరేంద్రమోదీఅధికారికంగా ప్రకటించినట్టు ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. ఇదిలా ఉండగా దేశంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా.. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1035 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. మరో 40 మంది చనిపోయారు. ఫలితంగా దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కి చేరింది. మహారాష్ట్రలో మొత్తం 1666 కేసులు నమోదు కాగా... ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 110మంది చనిపోయారు. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 903 మందికి కరోనావైరస్సోకగా.. వారిలో 27 మంది కోలుకున్నారు. 14 మంది మరణించారు. అటు తమిళనాడులో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 911 కేసులు నమోదవగా.. 9మంది చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో 487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 45 మంది కోలుకోగా.. 12 మంది మరణించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>