సోషల్ మీడియావేదికగా ఎన్నో వార్తలు ధోనీ రిటైర్మెంట్ పై వచ్చాయి ఇక ధోనీ రిటైర్మెంట్ పై ఎంతో మంది క్రికెట్దిగ్గజాలు కూడా స్పందిస్తూ ధోనిరిటైర్మెంట్ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు వెళ్లువెవెత్తుతున్న వేల ఇంగ్లాండ్మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ధోనికి అండగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ధోనీ గొప్ప ఆటగాడు అంటూ ప్రశంసించిన ఇంగ్లాండ్మాజీ కెప్టెన్ నాసర్హుస్సేన్.. అలాంటి గొప్ప ఆటగాడు తరానికి ఒక్కడు మాత్రమే ఉంటాడు అంటూ ప్రశంసించాడు. అలాంటి ఆటగాడిని ముందుగానే రిటైర్మెంట్ లో కి నెట్టొద్దు అంటూ అందరికీ సూచించాడు నాసిర్ హుస్సేన్. భారత క్రికెట్కు మహేంద్రసింగ్ ధోనిచేయాల్సింది ఇంకా చాలానే ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ధోనీ ఒక్కసారి వెళ్ళి పోయాడు అంటే మళ్లీ వెనక్కి తీసుకు రావడం కష్టం అంటూ తెలిపాడు. ఆటలో కొందరు మాత్రమే లెజెండ్స్ ఉంటారని ... అలాంటివారు తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారని... ధోనిఅలాంటి ఆటగాడే అంటూ ప్రశంసించాడు. ధోని మానసిక స్థితి ఏమిటో ధోనికి మాత్రమే తెలుసు అలాంటిది మీరు ముందుగానే ధోనిని రిటైర్మెంట్ లోకి నెట్టొద్దు అంటూ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అయితే అంతకు ముందు ఎంతో మంది ప్రముఖులు కూడా ధోనీకి అండగా నిలుస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని... తన రిటైర్మెంట్ గురించి ధోనీకి వదిలేద్దాం అంటు చాలామంది వ్యాఖ్యానించారు.
]]>