అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పటిక వరకూ అజయ్భూపతి రెండో సినిమాఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సినిమాకథ సిద్ధమైనా క్యాస్టింగ్ ఇంకా రెడీ కాలేదు. అయితే మొత్తానికి ఈ కథ నచ్చిన హీరోశర్వానంద్సినిమాకు ఓకే చెప్పాడు. హీరోగా శర్వా ఓకే అయినా హీరోయిన్ఎంపిక మాత్రం జరగలేదు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాయి పల్లవిఈ సినిమాలో నటించేందుకు దాదాపు అంగీకరించిందనే అంటున్నారు. దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పైగా.. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కూడా సినిమాకు అడ్డంకిగా నిలిచాయి. కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గాక ఈ సినిమాషూటింగ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం శర్వానంద్, సాయి పల్లవికలిసి దర్శకుడు కిశోర్తిరుమలశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాచేస్తున్నారు. శర్వానంద్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. తన ఆశలన్నీ ఈ సినిమాల పైనే పెట్టుకున్నాడు. సాయి పల్లవిప్రస్తుతం నాగచైతన్యతో లవ్ స్టోరీసినిమాచేస్తోంది. అజయ్భూపతి కూడా ఆర్ ఎక్స్100 సక్సెస్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. సాయి పల్లవిసినిమాచేయడానికి ఓకే చెప్తుందో లేదో చూడాలి.
]]>