Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298438

డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్త..!

$
0
0
డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. వినియోగదారులకు అందించిన అన్ని డీటీహెచ్, కేబుల్ సెట్ టాప్ బాక్స్‌(ఎస్‌టీబీ)లు ఇంటర్ అపోరేబిలిటీకి సపోర్ట్ చేసేవిగా ఉండాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అవసరమైన నిబంధనలు తీసుకొచ్చి దీనిని తప్పనిసరి చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది.

ఇంటర్ అపరేబుల్ సెట్‌టాప్ బాక్స్‌లు.. కొత్త సెట్‌టాప్ బాక్స్‌లను కొనుగోలు చేయకుండానే డీటీహెచ్ ఆపరేటర్‌ను మార్చుకునే వీలుకల్పిస్తాయి. ఈ ప్రక్రియ అమలులో సమన్వయానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖ, ట్రాయ్‌, బ్యూరో ఆఫ్‌ ఇండియన్స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), టీవీలు ఉత్పత్తి చేసే సంస్థలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది.



మరోవైపు అన్ని డిజిటల్‌ టీవీలు యూఎస్‌బీ పోర్ట్‌కు సపోర్ట్ చేయాలని, కేబుల్‌, శాటిలైట్‌ సిగ్నళ్లు స్వీకరించగలిగేలా తయారు చేయాలని సూచించింది.  అలాగే, డిజిటల్ టెలివిజన్సెట్ల కోసం యూఎస్‌బీ పోర్టు ఆధారిత సాధారణ ఇంటర్‌పేస్‌ను తప్పనిసరి చేయాలని కూడా ట్రాయ్ ప్రతిపాదించింది.  


]]>

Viewing all articles
Browse latest Browse all 298438

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>