ఇదిలా ఉండగా, హఠాత్తుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తప్పించి తమిళనాడుకు చెందిన కనగరాజునుఎస్ఈసీగా జగన్సర్కార్ నియమించింది. ఈ నియామకం తప్పా రైటా అన్నది పక్కన పెడితే అర్జంటుగా ఆర్డినెన్స్ తెచ్చి మరీ నిమ్మగడ్డను ఇంటికి పంపడం అంటే మాత్రం అది ఏపీజనాలకు విస్మయం కలిగించేలాగానే ఉంది.
ఇక జగన్విషయానికి వస్తే ఆయన ఈ చర్యతో రాజకీయంగా గెలిచారు. కానీ జనాల్లో వేరే విధమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిమ్మగడ్డ జగన్ని హర్ట్ చేసి ఉండవచ్చు. నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉండవచ్చు కానీ ఏపీని అతి పెద్ద కరోన ముప్పు నుంచి తప్పించారన్నది మెజారిటీ ప్రజల భావనగా ఉంది.
నిజానికి ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే వారికి అంతగా ఆసక్తి లేని విషయాల్లో రాజకీయాలు ఒకటిగా ఉంటాయి. చంద్రబాబు జగన్మీద ఎత్తులు వేసినా దాన్ని జగన్చిత్తు చేసినా కూడా జనాలు పట్టించుకోరు. అది ఆ ఇద్దరి గొడవగానే చూస్తారు
ఇదిలా ఉండగా నిమ్మగడ్డను తప్పించడం ద్వారా జగన్ఏం చెప్పదలచుకున్నారన్నది కూడా ఇక్కడ పాయింటే. నిమ్మగడ్డ మంచి చేయలేదని జనాలు అనుకోవడంలేదు. ఆయన ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడారని కూడా భావిస్తున్నారు.
అందువల్ల జగన్తీసుకున్న ఈ నిర్ణయం జనంలో కొంత వ్యతిరేకత వచ్చేలాగానే ఉంది. అందుకే మొదట చెప్పినట్లుగా జగన్రాజకీయంగా పై ఎత్తు వేసి గెలిచినా జన సామాన్యంలో మాత్రం కొంత వ్యతిరేకతను తెచ్చుకున్నారని అంటున్నారు. చూడాలి ఈ పరిణామాల పర్యవసానాలు ఎలా ఉంటాయో.
]]>