కరోనా వల్ల పనులు లేక నానా అవస్థలు పడుతున్న సినీ కార్మికుల కు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కి విశేషమైన స్పందన వస్తుంది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో వున్న చాలా మంది ప్రముఖులు సీసీసీకి విరాళాలు ఇవ్వగా తాజాగా ఈ జాబితాలోకి స్టార్ డైరెక్టర్కొరటాలశివకూడా చేరాడు. మన ఫిలిం ఇండస్ట్రీలో రోజువారి వేతన కూలీల కోసం 5 లక్షలను సీసీసీ కి డొనేట్ చేస్తున్నాను..సాయం కాదిది తోడు అని కొరటాల ట్వీట్ చేశాడు. ఇంతకుముందు కరోనా పై పోరుకు ఈ డైరెక్టర్తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రుల సహాయనిధికి 5లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు.
Donating 5 lakhs to #CoronaCrisisCharity for the welfare of daily wage workers of our film industry. I’m a part of this beautiful family and we all will fight this together. సాయం కాదిది. తోడు 🙏
— koratala siva (@sivakoratala) April 11, 2020
ఇక భరత్అనే నేను తరువాత చాలా గ్యాప్ తీసుకున్న కొరటాలప్రస్తుతం మెగాస్టార్చిరంజీవితో ఆచార్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమారెండు కీలక షెడ్యూల్ లను పూర్తి చేసుకుంది. రామ్ చరణ్కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాజల్కథానాయికగా నటించనుండగా మణిశర్మసంగీతం అందిస్తున్నాడు. దసరాకానుకగా ఈసినిమా ను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు సోషల్ మెసేజ్ తో కథను రెడీ చేసుకొని దానికి కమర్షియల్ అంశాలను జోడించి బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ వస్తున్న కొరటాల, ఆచార్య ను కూడా అదే ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడట.
]]>