Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298438

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ షార్ట్ ఫిలిం అదరహో... !

$
0
0
కరోనాను అరికట్టేందుకు ఇండియాలోని సూపర్ స్టార్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అలాగని ఈ లాక్ డౌన్ టైమ్ లో అందరూ ఒకే చోటికొచ్చి నటించలేదు. కరోనాను కట్టడి చేసేందుకు తమలాగే అంతా ఇళ్లకే పరిమితం కావాలన్న సందేశం ఇస్తూ.. ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలింలో విడివిడిగా ఉంటూనే.. కలిసి నటించిన ఫీలింగ్ క్రియేట్ చేశారు. 

అమితాబ్ బచ్చన్సలహా.. సూచన మేరకు సోనీనెట్ వర్క్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించింది. అమితాబ్ఇంట్లో ఉంటూ.. తన కూలింగ్ గ్లాసెస్ వెతుకుతుంటాడు. అవెక్కడున్నాయో.. రణ్ వీర్.. దిల్జీత్ దోసంజ్ ఇళ్లంతా కలియతిరుగుతారు. ఈ క్రమంలో చిరంజీవి.. రజినీకాంత్.. మోహన్లాల్.. మమ్ముట్టి.. శివరాజ్ కుమార్ను కూలింగ్ గ్లాసెస్ గురించి ఆరా తీస్తారు. చివరికి కూలింగ్ స్పెట్స్ ను ప్రియాంకా చోప్రాతీసుకెళ్లి అమితాబ్కు ఇవ్వడంతో కథ సుఖాంతం అవుతుంది. 



షార్ట్ ఫిలిమ్ చివర్లో ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పారు అమితాబ్. లాక్ డౌన్ సందర్భంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులు.. దినసరి కూలీలకు నిధులు సమకూర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు అమితాబ్. 



ఈ షార్ట్ ఫిలిమ్ లో నటించన వారందరూ ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు అమితాబ్. ఎవరూ భయపడొద్దని ఇళ్లకే పరిమితమైతే.. మహమ్మారి తొలిగిపోతుందన్నారు. షార్ట్ ఫిలిమ్ లో రజినీకాంత్తనదైన స్టైల్లో స్పెట్స్ తిప్పిన తీరు.. బాత్రూమ్ లోకి నీళ్లే రావడం లేదు. ఇక కళ్లజోడు ఏమొస్తుందని చిరంజీవివెటకారం.. రణ్ వీర్, దిల్జీత్.. ఆలియా భట్చేసిన సందడి బాగుంది. ఇంతమంది సూపర్ స్టార్స్ నటించిన ఈ షార్ట్ ఫిలిమ్ ను ప్రముఖ యాడ్ డైరెక్టర్ప్రసూన్ పాండే డైరెక్ట్ చేశారు. మొత్తానికి అమితాబ్ఇటు సినీనటులకు అటు ప్రజలకు మంచి సందేశాన్నే ఇచ్చారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 298438

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>