అయితే ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా రిషికేశ్లో గంగానది ఒడ్డున పది మంది విదేశీయులు షికార్లు కొడుతున్నారు. వారి దురదృష్టం ఏంటంటే.. అప్పుడే అక్కడకు పోలీసులు రావడం.. వీళ్లు పోలీసుల కండబడడం జరిగిపోయింది. దీంతో పోలీసులు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందుకు సదరు విదేశీయులతో 500 సార్లు సారీ అని రాయించారు. ఆ విదేశీయుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్దేశాలకు చెందివారు. పోలీసులు ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోయారు.
దీంతో వారి చేత పోలీసులు `నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు క్షమించండి` అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు. కాగా, రిషికేశ్విదేశీయులకు ఓ అందమైన పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికాదౌత్యకార్యాలయాలు తమ వారిని వెంటనే భారత్నుంచి తరలించాయి. ఇంకా కొందరు విదేశీయులు రిషికేశ్లోనే ఉన్నట్టు తాజా ఘటన ద్వారా బయటపడింది. దీంతో పోలీసులు కఠన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
]]>