అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కోర్టుకు వెళ్లినా గాని జగన్కే ఫేవర్ గా పరిస్థితులు ఉండేలా పర్ఫెక్ట్ గా, జగన్ఈ విషయంలో డీల్ చేశారు అని న్యాయ నిపుణులు అంటున్నారు. మామూలుగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు అంత ఈజీ కాదు దానికి పార్లమెంటు ఆమోదం కావాలి అని అప్పట్లో...రమేష్ కుమార్ఎన్నికల వాయిదా వేసిన టైములో వార్తలు గట్టిగా వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా జగన్వ్యవహరించారని న్యాయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారిని తొలగించాలంటే కచ్చితంగా పార్లమెంటు ఆమోదం కావాలి. ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో రాజ్యాంగం ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలం, నియామక అర్హతలు, వేతనాలు వంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఖరారు చేయవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీజరగడం కష్టం కాబట్టి ఏపీప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదంతా రాజ్యాంగబద్దమే. కొత్త నిబంధనలు అమలులోనికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ తన పదవిని కోల్పోవడం జరిగింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్కోర్టుకు వెళ్లిన ఒరిగేది ఏమీ లేదని చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు.
]]>