సుబ్రమణ్యపురం సినిమాతరువాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. వచ్చినా కూడా అవి ధియేటర్లకు ఎపుడు వచ్చాయో వెళ్ళాయో కూడా తెలియని మూవీలే. దాంతో ఈషా సినీ కెరీర్ మీద చాలా బెంగెట్టెసుకున్నట్లుంది.
ఈ నేపధ్యంలో ఆమె బోల్డ్ డెసిషన్ తీసుకుంది. అదే వెబ్ సీరీస్ లో నటించాలని. బాలీవుడ్లో ఇపుడు వెబ్ సీరీస్ సీజన్ బాగా నడుస్తోంది. లాభాల పంట పండిస్తోంది. ప్రపంచం అంతా డిజిటల్ అయిన వేళ వెబ్ సీరియళ్ళకు యమ క్రేజ్ కూడా వస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే బాలీవుడ్లో తీస్తున్న లస్ట్ స్టోరీస్వెబ్ సీరియల్ తెలుగు వెర్షన్లో ఈషారెబ్బా నటిస్తోంది. దాంతో ఈషా రెబ్బఅబ్బా అనిపిస్తుందా అన్న న్యూస్ ఇపుడు పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతోంది. అసలే అందాల ముద్దు గుమ్మ. సినిమాల్లో చూపించని గ్లామర్ ని ఇక్కడ పండిస్తునా. అన్నీ వండి వారుస్తుందా అన్నది కూడా సౌందర్యప్రియులకు ఉత్కంఠగా మారింది.
ఇదిలా ఉండగా లస్ట్ స్టోరీస్లో బోల్డ్ క్యారక్టర్ ఒప్పుకున్న ఈషా రెబ్బతాను మితిమీరకుండానే అందాల ఆరబోత చేస్తానని అంటోంది. ఈ విషయంలో తనకు ఉన్న పరిధులూ, పరిమితులూ తెలుసు అని తెలివిగా చెబుతోంది. అంటే లస్ట్ స్టోరీస్లో గ్లామర్ వడ్డన ఎంత ఉండాలో అంతే అన్నట్లుగా తూకం వేస్తానని చెబుతోంది. ఏది ఏమైనా వల్గారిటీకి దూరంగానే చూపించాల్సింది చూపిస్తానని మాత్రం తీపి కబురు చెబుతోంది
ఇంకేం సినిమాల్లో చాన్సులు రాకపోయినా కూడా ఈ అమ్మడు వెబ్ సీరియల్స్ లో హిట్ అయితే కుర్ర కారుని ఊపేయదా, పెద్ద ఫ్యాన్ మెయిల్ తో ఊరేగదా. చూడాలి మరి.
]]>