తెలంగాణరాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశం ఐదు గం టలకుపైగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చ ర్చి స్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ పొడిగించడం తప్ప మరో మార్గం లేదని కేబినెట్నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోపక్క లాక్‌డౌన్ పెంచాలా వద్దా అనే అంశంపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీఅన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రధానికి తెలిపారు.
కాగా కరోనా కట్టడికి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ ను పొడిగించాలని తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ప్రధానిని కోరారు. కేసీఆర్తోపాటు చాలా రాష్ట్రాలు దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాగా మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
]]>