లాక్‌డౌన్‌తో దేశ ప్రజలంతా ఓ పక్క ఉంటే… వీళ్ళు మాత్రం అర్ధం పర్ధం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఏపీడిప్యూటీ సీఎం కే నారాయణస్వామి ముస్లింల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీతబ్లీకి జమాత్కి వెళ్ళి వచ్చిన ముస్లింలు అందరూ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు ఎవరికి వారు శుభ్రత పాటించమని ఓ పక్క చెప్పుతున్నప్పటికీ..ప్లేట్లు, స్పూన్లు నాకుతున్నారని కామెంట్ చేశారు.
అలాగే పాజిటివ్ వచ్చిన వారు వేరే వాళ్ళతో మాట్లాడకుండా జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలో ఉండమని చెపుతున్నా, వారు మాట వినకుండా అందరితో మాట్లాడుతున్నారని ఆయన మండిపడుతున్నారు. వాళ్ళు కావాలనే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారన్నారు.
కరోనా పై యుద్ధ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఓ పక్క పోలీసులు, వైద్యులు, సెలబ్రెటీల సైతం చెపుతున్నా వీళ్లు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండి పడ్డారు.. ఇ లాంటి ప్రవర్తన వల్ల వీరు కావాలనే ఈ వైరస్‌ని మొత్తం అందరికీ ప్రభలేలా చూస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
]]>