ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశం, వైఎస్ఆర్జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 75, నెల్లూరు 48, ప్రకాశం 41, కృష్ణా 35 కేసులు, కడప 30, పశ్చిమగోదావరి జిల్లా 22, విశాఖ 20, చిత్తూరు జిల్లాలో 20, తూర్పుగోదావరిజిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 388 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు అధికారులు శనివారం రాత్రి వివరాలు వెల్లడించారు. అయితే..ఏపీలో కరోనా వ్యాప్తి నిరోధానికి మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
]]>
ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీకి ఏపీసీఎం జగన్ పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్ విషయంలో కొన్ని సడలింపులు చేయాలని,రెడ్‌జోన్లలో మినహా.. మిగతా ప్రాంతాల్లో సడలింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధానివీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీముఖ్యమంత్రి జగన్ పలు విషయాలను మోడీకి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం, నిత్యావసర సరుకుల తరలింపు విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ప్రజారవాణా, పాఠశాలలపై లాక్‌డౌన్ కొనసాగించాలని అన్నారు. అయితే.. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా స్వల్ప సడలింపులతో పలు లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు సీఎం జగన్ మొగ్గుచూపతున్నట్లు సమాచారం. ఏపీలో ప్రధానంగా కర్నూలు, గుంటూరులో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.
]]>