సినీకార్మికుల అవసరాలు తీర్చడంలో భాగంగా వాళ్ల బ్యాంక్అకౌంట్స్ ను స్వీకరించాల్సిందిగా.. ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్సినీ ఎంప్లాయిస్ సంస్థను కోరాడు సల్మాన్. వాళ్లు 23వేల మంది వివరాలు సేకరించగా తొలి విడతగా.. వాళ్ల ఖాతాల్లో సల్మాన్రూ.3వేలు జమ చేశారని ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తివారి తెలిపారు.
23వేల మందికి ఒక్కొక్కరికి 3వేల రూపాయలు జమ చేయగా.. మొత్తం 6కోట్ల 90లక్షలు ఖర్చయింది. ఫెడరేషన్ అధ్యక్షుడు తివారీ మాట్లాడుతూ.. ఒకేసారి ఎక్కువ మొత్తం జమ చేస్తే.. అనవసరంగా ఖర్చు చేస్తారన్న ఉద్దేశంతో పలు విడతల్లో ఇవ్వాలనే నిర్ణయానికి సల్మాన్ ఖాన్వచ్చారన్నారు. త్వరలో రెండు మూడు విడతల్లో మిగతా డబ్బులను వేస్తానని ప్రకటించారు. పరిస్థితులు చక్కబడే వరకు సినీ కార్మికులు సహాయం చేస్తానని సల్మాన్ప్రకటించారు.
సల్మాన్మాదిరి నిత్యావసరాలు అందించే క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ఫిల్మ్స్ సంస్థ 3000మంది సినీ కార్మికులకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. వీళ్లతో పాటు రోహిత్ శెట్టి, బోనీ కపూర్, అర్జున్ కపూర్ఫిల్మ్ ఫెడరేషన్ విరాళాలు అందజేశారు. ఇక ప్రొడ్యూసర్గిల్ట్ ఆఫ్ ఇండియారూ.1.5కోట్లు సాయం చేసింది. తెలుగు ఇండస్ట్రీకరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు.
]]>