కలసికట్టుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొని విజయం సాధిద్దామని తెలంగాణరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రికే తారకరామారావు అన్నారు. ఈ రోజు ఆయన ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన సుమారు 90 మంది పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా ప్రస్తుతం కరోనా సంక్షోభం విసిరిన సవాళ్ల నుంచి అందివచ్చిన అవకాశాలను గుర్తించాలని, అలాంటి రంగాల్లో తమ భవిష్యత్తు పెట్టుబడులను పరిశీలించాలని ఈ సందర్భంగా వారిని మంత్రికోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రభుత్వం కరోనా వైరస్ఎదుర్కునేందుకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రభుత్వం వివిధ రంగాలకు అందిస్తున్న మద్దతును వారికి వివరించి చెప్పారు.
పలు పరిశ్రమలకు ప్రాతినిద్యం వహిస్తున్న అంత్రప్రెన్యూర్స్ అర్గనైజేషన్ కు సంబంధించిన పలువురి ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని, అయా పరిశ్రమలు ఈ సంక్షోభ కాలంలో సురక్షితంగా ఉన్నప్పుడే, వారి ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని మంత్రికేటీఆర్అన్నారు. ఇందుకు సంబంధించి వివిధ పారిశ్రామిక రంగాలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. లాక్ డౌన్ వలన పలు రంగాలకు/ పరిశ్రమకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పదని ఈ సందర్భంగా వారికి తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆపత్కాలంలో ప్రభుత్వానికి, వారి వారి సంస్థల ఉద్యోగులకు మీరంతా అండగా ఉండాలని ఈ సందర్భంగా అంత్రప్రెన్యూర్స్ అర్గనైజేషన్ ప్రతినిధులను మంత్రికేటీఆర్కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వివిధ పారిశ్రామిక సంఘాలతో మాట్లాడి పరిశ్రమల మద్దతుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక ప్రణాళిక రూపొందిస్తామని ఈ సందర్భంగా మంత్రితెలిపారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో తమ అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ప్రస్తుత పరిస్థితుల పట్ల భరోసా ఇచ్చినందుకు మంత్రికేటీఆర్కు అంత్రప్రెన్యూర్స్ అర్గనైజేషన్ సభ్యులు దన్యవాదాలు తెలిపారు. తెలంగాణప్రభుత్వం కరోనా కట్టడి కోసం, లాక్ డౌన్ సందర్భంగా తీసుకుంటున్న నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లోనూ తామంత భాగస్వాములమౌవుతామని ఈ సందర్భంగా మంత్రికేటీఆర్కి వారు హామీ ఇచ్చారు. మంత్రికోరినట్టు తమ తమ పరిధిలో ఖచ్చితంగా అవసరమైన వారికి సహకారం అందిస్తామన్నారు.
]]>