తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభించడంతో సీఎం కేసీఆర్ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇక శనివారం ఏడు గంటల పాటు కేబినెట్భేటీ అనంతరం కేసీఆర్లాక్‌డౌన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏప్రిల్ 14వ తేదీతో లాక్‌డౌన్ ముగియనుండడంతో ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని సూచించారని కేసీఆర్చెప్పారు.
ఈ రోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించాక మరి కొద్ది రోజులు లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించాము. దయచేసి ఇది మన కుటుంబం.. మన కోసం.. మన సమాజం బాగు కోసం ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని కేసీఆర్చెప్పారు. ప్రతి ఒక్కరు నష్టపోకూడదని.. సమాజాన్ని నష్టపోకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కేసీఆర్కేబినెట్లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒకటో తరగతి నుంచి 9వ తరగతికి చదువుతున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను పాస్ చేస్తున్నామని.. వారు పరీక్షలు లేకుండా నెక్ట్స్ తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు.
]]>