మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామని 1640మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని సీఎం కేసీఆర్ముఖ్యమంత్రి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయని, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు అందరూ కోలుకుంటారని సీఎం కేసీఆర్ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఉత్పాతం రాకపోతే మనం చాలా వరకు బయటపడుతామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ప్రకటించారు. ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఒకవేళ పరిస్థితులు అదుపులోకి వస్తే.. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేస్తామని ఆయన ప్రకటించారు.
]]>