ఇక శనివారం మధ్యాహ్నం ఏకంగా ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన కేబినెట్సమావేశంలో తాము తీసుకున్న లాక్‌డౌన్ పొడిగింపు తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపుతున్నట్టు కేసీఆర్చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా పంటలకు నీరు అందిస్తామని కేసీఆర్చెప్పారు. ఇక మోదీకి పంపుతోన్న తీర్మానంలో లాక్ డౌన్ పొడిగింపు అంశంతో పాటు రైతులకు మేలు జరిగేలా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తాము మోదీకి పంపిన డిమాండ్లలో కోరామని కేసీఆర్చెప్పారు.
అంటే రైతులు పొలం పనులకు అయ్యే కూలీ ఖర్చులో 50 శాతం భరిస్తే.. మరో 50 శాతం నరేగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతు కూలీలు, రైతులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ అవుతుంది. ఈ కరువు టైంలో ఇది మంచి ప్రయోజనం చేకూర్చినట్లువుతంది.
]]>