అందరూ ఊహించినట్టుగానే తెలంగాణసీఎం కేసీఆర్లాక్‌డౌన్ పొడిగించారు. శనివారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ నిర్వహించాలని కేబినెట్నిర్ణయించిందన్న కేసీఆర్.. ప్రజలంతా దయ చేసి మన క్షేమం, మన భవిష్యత్తు కోసం పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. గతంలో సహకరించినట్లుగానే.. ఇప్పుడు కూడా సహకరించాలని కోరారు.
అలాగే రాష్ట్రాలు కేంద్రానికి కట్టాల్సిన అప్పుల విషయంలో ఆరు నెలల వరకు టైం ఇవ్వాలని తాము ప్రధానమంత్రి మోదీని కోరామని కేసీఆర్తెలిపారు. వాస్తవంగా ఈ రెండు నెలల టైంలో తెలంగాణప్రభుత్వానికి నెలకు రు. 4 వేల కోట్ల ఆదాయం రావాలి... అయితే ఇప్పటి వరకు రు. 100. 15 లక్షలు మాత్రమే వచ్చిందని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అప్పులు కట్టే పరిస్థితి లేదని కేసీఆర్తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యావసరాలు, ప్రజలకు కనీస అవసరాల ఇబ్బందులే లేకుండా ఉండాలంటే కేంద్రంకు కట్టే అప్పులకు ఆరు నెలల పాటు గడువు ఇవ్వాల్సిందే అని కేసీఆర్కేంద్రాన్ని గట్టిగా కోరారు.
]]>