తెలంగాణ సీఎం కేసీఆర్శనివారం రాత్రి సుదీర్ఘమైన కేబినెట్భేటీ తర్వాత విలేకర్ల సమావేశం నిర్వహించారు. మరో రెండు వారాల పాటు మనం అందరం ఓపిక పడితే ప్రతి ఒక్కరు ఈ గండం నుంచి గట్టెక్కుతామని సూచించారు. ఈ క్రమంలోనే కరోనాను నియంత్రించడంలో మిగిలిన దేశాల కంటే మన దేశం ఎంతో ముందు ఉందని ప్రశంసించారు. కుల, మత, జాతులకు అతీతంగా ప్రతిఒక్కరు ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు పాటించాలన్నారు. ఒక్క వ్యవసాయ పనులను మాత్రం అనుమతి ఇస్తామని చెప్పారు.
ఇక ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే హెలీకాప్టర్ మనీ ఒక్కటే మార్గమని సూచించారు. మనదేశ దేశ జీడీపీ రు. 203 లక్షల కోట్లుగా ఉంది అని.. ఇందులో కనీసం 5 శాతం హెలీకాఫ్టర్ మనీగా పంచాలి.. అప్పుడే ఈ సంక్షోభం నుంచి తాత్కాలికంగా గట్టెక్కుతామని ఆయన చెప్పారు. ఇక మనదేశ జనాభా 135 కోట్లు అని.... మనదేశానికి అన్నంపెట్టే శక్తి ఏ దేశానికి లేదని... ప్రపంచంలో 100 దేశాలు తెలంగాణసమాజం కంటే చిన్నవని... మన ఆహారం మనమే సంపాదించుకోవాలని... అందుకే రైతాంగాన్ని మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు పెట్టవద్దని తాను మోదీకే చెప్పానని కేసీఆర్తెలిపారు.
]]>