ఇక అక్కడి నుండి సమంతకు ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా అవకాశాలు క్యూ కట్టాయి. అనంతరం అనతికాలంలోనే సమంతటాలీవుడ్స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఇటీవల తన తొలి సినిమాహీరోఅయిన నాగచైతన్యను వివాహమాడి అక్కినేనివారి ఇంటి కోడలుగా మారిపోయిన సమంత, వివాహం తరువాత మాత్రం కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే టాలీవుడ్లో సమంతకు గోల్డెన్ లెగ్ అనే ఒక మంచి పేరుంది.
ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు సినిమాలు సక్సెస్ని అందుకుని ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టడం జరిగింది. ఇక కొన్నాళ్ల క్రితం సమంతచిన్నప్పటి ఫోటో ఒకటి పలు సోషల్ మీడియామాధ్యమాల్లో వైరల్ అయి ఆమె ఫ్యాన్స్ ని అలరించచడం జరిగింది. లేలేత బుడిబుడి అడుగులు వేసే ఆ వయసులో చూడడానికి ఆ ఫొటోలో సమంతఎంతో క్యూట్ గా ఉంది. అయితే మళ్ళి ఇన్నిరోజులు తరువాత సమంతఫ్యాన్స్ కొందరు దానిని పలు మీడియామాధ్యమాల్లో అప్ లోడ్ చేసి, ఒకప్పటి తమ అభిమాన నటీమణి గుర్తులను నెమరువేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఇదే ఫోటో మరింతగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది....!!
]]>