ఏప్రిల్ 30వ తేదీవరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటన చేసిన తెలంగాణసీఎం కేసీఆర్ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మనం మంచి విజయం సాధిస్తామని చెప్పారు. అసలు ప్రపంచం ఎలా ఉన్నా కూడా మనలను.. మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఇక సామూహిక ప్రార్థనలు చేయొద్దని సూచించిన కేసీఆర్.. ఈ నాలుగు రోజులు ఓపిక పడితే.. ఏప్రిల్ 30 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తామన్నారు.
ఈ రోజు అమెరికాలాంటి అగ్రరాజ్యం హెలీకాఫ్టర్ అంబులెన్స్ ఉండి.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోదేశాల నుంచి అన్ని రప్పించుకునే సత్తా ఉండి కూడా కరోనా దెబ్బతో అతలాకుతలం అవుతోందిని.. ఇప్పటికే అక్కడ లక్షల్లో బాధితులు.. వేలల్లో మరణాలు ఉన్నాయని... మనకు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు క్యూ ఈ పద్ధతిని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
]]>