కరోనా కట్టడి కోసం ముందు నుంచి ఉన్న లాక్‌డౌన్ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 30 వరకు పోడిగించాలని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోద ముద్ర వేయడంతో లాక్ డౌన్ 30 వరకు వెళ్లిపోయింది. ఇక ఈ విషయంలో ముందుగా తెలంగాణసీఎం కేసీఆర్తన నిర్ణయాన్ని వెల్లడించగా.. ఆ తర్వాత ఒడిశాసీఎం నవీన్ పట్నాయక్ లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం మే 1వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించారు.
ఇక శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. అదే టైంలో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు మాత్రం తమ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారని... వీరిని ప్రత్యేక రైళ్ల ద్వారా సొంతూళ్లకు తరలించడాన్ని కూడా అనుమతించలేదన్నారు.
]]>